ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర 2' చిత్రం ఫిబ్రవరి 8న విడుదలైంది.
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతుల హక్కుల కోసం ఓ యువకుడు పోరాడుతున్నట్లు చూపించే చిత్రం 'రాజధాని ఫైల్స్' ఫిబ్రవరి 15న విడుదలైంది.
ఈ సినిమాలకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ పార్టీలు మద్దతిచ్చాయని తెలుస్తోంది. ఇక పార్టీల మద్దతుదారులు ఈ సినిమాలను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు.
అయితే, "రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనలో వ్యభిచారం జరుగుతుండగా పట్టుకున్న పోలీసులు" అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ ఈ పోస్ట్ తప్పుదారి పట్టించేదిగా మరియు తప్పుగా ఉన్నట్లు గుర్తించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టగా, వైరల్ స్క్రీన్‌గ్రాబ్ యొక్క పూర్తి వీడియోను మేము కనుగొన్నాము. దీని ద్వారా ఘటనలో నిజానిజాలు తెలుసుకున్నాం.
'రాజధాని ఫైల్స్' చిత్రం ఫిబ్రవరి 15న విడుదల కానుండగా YSRCP, గౌరవనీయులైన హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ లో రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో 'రాజధాని ఫైల్స్' సినిమా విడుదలపై హైకోర్టు స్టే విధించింది.
"రాజధాని ఫైల్స్" సినిమా విడుదలపై హైకోర్టు స్టే ఇవ్వడమే ఆలస్యం. కనీసం ఆర్డర్ కాపీ కూడా రాకముందే రాష్ట్రవ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లపైకి , ప్రభుత్వం అధికారులను ఉసిగొల్పింది. తక్షణం సినిమా ప్రదర్శనలు ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్లకు వెళ్లి షోను అర్ధాంతరంగా ఆపేశారు.
విజయవాడ [ విజయవాడలోని ట్రెండ్‌సెట్ మాల్‌లో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున సంఘటన కి సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది ], గుంటూరు, ఒంగోలు, విశాఖ సహా అన్నిచోట్లా సినిమాను మధ్యలోనే ఆపేశారు. పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు ప్రదర్శనను నిలిపివేయడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు చెల్లించి టికెట్లు కొన్నందున. సినిమా పూర్తిగా చూసేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. హైకోర్టు స్టే ఇచ్చినందున ప్రదర్శన నిలిపేస్తున్నట్లు అధికారులు బదులిచ్చారు. స్టే ఆర్డర్ చూపించాలని పలువురు ప్రేక్షకులు నిలదీయగా, అధికారులు నీళ్లు నమిలారు. ఈ క్రమంలో ప్రేక్షకులు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది.
తద్వార, నిజానికి జరిగింది ఇది, పోలీసులు ట్రెండ్‌సెట్ మాల్‌లోని థియేటర్‌లోకి ఎందుకు ప్రవేశించారు అనే వివరాలు ఈ వీడియో ద్వారా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇదే విషయాన్ని పలు
వార్తా ఛానళ్లు ప్రసారం చేశాయి.
అందువల్ల, పోస్ట్‌లోని దావా తప్పుదోవ పట్టించేది మరియు తప్పు అని మేము నిర్ధారించాము.