Fact Check: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి Republic TV ఎలాంటి ప్రీ పోల్ సర్వే నిర్వహించలేదు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో Republic TV పేరుతో ముందస్తు ఎన్నికల సర్వే విడుదలైంది. ఈ సర్వే ఆసక్తికరంగా అనిపించింది.
By Sridhar Published on 11 Feb 2024 5:13 PM ISTరానున్న జనరల్ మరియు అసెంబ్లీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ఎన్నికల వాతావరణం నెలకొనడంతో కొన్ని సంస్థలు ప్రీ పోల్ సర్వేలు నిర్వహించడం ప్రారంభించాయి.
India Today 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీ సీట్లలో TDP 17, మిగిలిన 8 సీట్లు YSRCP గెలుచుకుంటుందని అంచనా వేసింది.
ELECSENSE నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలు YSRCP కి 122 ఎమ్మెల్యే సీట్లు, TDP-JSP కూటమికి 53 సీట్లు వస్తాయని అంచనా వేసింది
అలాగే Republic TV పేరుతో, ప్రీ పోల్ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది 08/02/2024 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలకు ముందస్తు పోల్ సర్వేను చూపుతుంది. మనం Republic TV నుండి రెండు విభిన్న సర్వే ఫలితాలను చూడవచ్చు.
TDP-JSP కూటమికి 132 సీట్లు, YSRCP పార్టీకి 41 సీట్లు, ఇతరులకు 2 సీట్లు వస్తాయని సోషల్ మీడియాలొ కొందరు యూజర్లు సర్వే ఫలితాలను షేర్ చేస్తున్నారు.
ప్రజా విజయం రాబోతుంది ✌️✌️🚲🚲 pic.twitter.com/9whR9wtoX5
— Dr. Kalikiri Murali Mohan (@kmuralimohan_) February 8, 2024
మరికొంతమంది YSRCP కి 132 సీట్లు, TDP-JSP కూటమికి 41, ఇతరులకు 2 సీట్లు వస్తాయని సర్వే ఫలితాలను షేర్ చేస్తున్నారు.
మరికొందరు, RTV లోగోతో మరియు Republic TV వెబ్‌సైట్ మూలంగా, ప్రీ పోల్ సర్వే ఫలితాలను చూపే Pie chart ను షేర్ చేసారు.
అయితే కొంతమంది ఈ సర్వేలను నమ్ముతున్నారు మరియు కొందరు గందరగోళానికి గురయ్యారు.
ఈ సర్వేల వెనుక ఉన్న నిజం ఏమిటి?
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ Republic TV పేరుతో చెలామణిలో ఉన్న సర్వేలు నకిలీవని గుర్తించింది. మేము మా పరిశోధనలొ Republic TV వెబ్‌సైట్‌ను క్షుణ్ణంగా పరిశీలించాము, Republic TV ప్రచురించిన ప్రీ పోల్ సర్వే ఏదీ మాకు కనిపించలేదు.
కానీ, మేము రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ యొక్క అధికారిక హ్యాండిల్ ద్వారా X మరియు Facebook లో ఒక పోస్ట్‌ను కనుగొన్నాము, అందులో అది ఒక ప్రకటనను విడుదల చేసింది, “రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ యొక్క మార్ఫింగ్ చేయబడిన లోగోను ఉపయోగించి నకిలీ ప్రచారం చెలామణి అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. రిపబ్లిక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎలాంటి సర్వే నిర్వహించలేదని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు."
Republic Media Network Statement
— Republic (@republic) February 8, 2024
It has come to our notice that fake propaganda is being circulated using the morphed logo of Republic Media Network. It is clarified that Republic has not conducted any pre-election survey in the state of Andhra Pradesh, as is being falsely…
ఈ Pie chartలొ మనం చూడగలిగినట్లుగా, ఇది RTV యొక్క లోగోను కలిగి ఉంది కానీ Republic TV వెబ్‌సైట్‌గా [ Source: www.republicworld.com ] మూలాన్ని కలిగి ఉంది.
అందువలన ఇది నకిలీ అని తేలికగా అర్థమవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో Republic TV ఎలాంటి ముందస్తు ఎన్నికల సర్వే నిర్వహించలేదు.
అందుకే, Republic TV పేరుతో చెలామణిలో ఉన్న ముందస్తు ఎన్నికల సర్వేలన్నీ నకిలీవే.
Claim Review:Republic TV pre-election survey on Andhra Pradesh elections
Claimed By:Social Media Users
Claim Reviewed By:News Meter Telugu
Claim Source:Social Media
Claim Fact Check:False
Next Story