Fact Check: సాక్షి ఆధ్వర్యంలో సంపూర్ణంగా నడవనున్న TV 9 మరియు NTV అంటూ వచ్చిన పోస్ట్ లో ఎలాంటి వాస్తవం లేదు

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Badugu Ravi Chandra  Published on  27 May 2024 7:13 PM GMT
Fact Check: సాక్షి ఆధ్వర్యంలో సంపూర్ణంగా నడవనున్న TV 9 మరియు NTV అంటూ వచ్చిన పోస్ట్ లో ఎలాంటి వాస్తవం లేదు
Claim: సాక్షి ఆధ్వర్యంలో సంపూర్ణంగా నడవనున్న TV 9 మరియు NTV
Fact: వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం అని న్యూస్‌మీటర్ కనుగొంది.

తెలుగు ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయడంలో మరియు సమాచారాన్ని ప్రసారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్స్ లో TV9 తెలుగు, NTV మరియు సాక్షి తెలుగు రాష్ట్రాల్లో ఒక పాత్ర పోషిస్తున్నాయి

ఈ ఛానెల్స్ ప్రేక్షకులను సమాచారం అందించడమే కాకుండా సామాజిక-రాజకీయ చర్చలను ప్రభావితం చేస్తూ, తెలుగు మాట్లాడే ప్రజల ఆందోళనలు మరియు ఆశయాలను ప్రతిబింబిస్తూ, రూపకల్పన చేస్తాయి

ఈ నేపథ్యంలో, బహిరంగ ప్రకటన చేయకుండా TV 9ని మరియు NTVని స్వాధీనం చేసుకున్న సాక్షి, భాగస్వామ్య హకులు తో పాటు యాజమాన్య హక్కులు బినామీల పేరున బదిలీ చేజిక్కించుకున్న జగన్ అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆ పోస్టులో ఇన్నాళ్లూ TV9 మరియు NTVకి వేసిన ముసుగు తొల‌గిపోయింది. రాజ‌కీయ నేత‌లు ఆరోపిస్తున్న‌ట్టుగానే అది సాక్షి-2 ఛానెల్‌లు అని తేలిపోయింది.ఇక నుంచి డైరెక్టుగా సాక్షియే, టివి9 మరియు NTVని బాధ్య‌త‌లు చూసుకుంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది అంటూ సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అవుతూ ఉంది.



ఆర్కైవ్ లింక్ ఇక్కడ
మరియు
ఇక్కడ

నిజ నిర్ధారణ :



వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీవని మరియు అది పుకారు అని న్యూస్‌మీటర్ కనుగొంది.

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, X లో 2024 మే 23న, టీవీ 9 తెలుగు [TV 9 Telugu] ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో టీవీ9 నెట్‌వర్క్ స్వాధీనం గురించి ఉన్న వదంతులకు ఎలాంటి సంబంధం లేదు. అవి పూర్తిగా తప్పుడు, ఆధార్ హీనమైన మరియు దురుద్దేశపూర్వకమైనవి. టీవీ9 నెట్‌వర్క్, భారతదేశంలో అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్, ఇటీవల కాలంలో అద్భుతమైన వృద్ధి కథను ప్రతిబింబిస్తుంది.

ట్రెండ్‌కు విరుద్ధంగా, TV9 నెట్‌వర్క్ అనేక కొత్త పరిశ్రమ ప్రమాణాలను స్థాపించింది, అనేక జాతీయ వారసత్వ ప్లేయర్లను దూరంగా మించిపోయింది. ఈ అద్భుత ప్రదర్శన ప్రసార మరియు డిజిటల్ డొమెయిన్లలో సాధించబడింది. వ్యాపారపరంగా నడుస్తున్న ఈ నెట్‌వర్క్ ఉత్తమమైన మరియు అత్యంత ఆవిష్కరణాత్మక ఎడిటోరియల్, ప్రోడక్ట్ మరియు మార్కెటింగ్ కార్యక్రమాలను కలిగి ఉంది. టీవీ9 నెట్‌వర్క్, భారతదేశ వృద్ధి కథకు సరైన వేదిక ఇవ్వడం కోసం గ్లోబల్ స్థాయిలో ప్ర‌వేశించ‌డానికి సన్నాహాలు చేస్తోంది " అని పేర్కొంది

అంతేకాకుండా, మేము NTV కార్యాలయాన్ని సంప్రదించాము. వైరల్ అయిన పోస్ట్ నకిలీదని మరియు అవాస్తవం అని వారు ధృవీకరించారు.

అందువల్ల, సాక్షి ఆధ్వర్యంలో సంపూర్ణంగా నడవనున్న టివి9 మరియు NTV అంటూ వచ్చిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.
Claim Review:సాక్షి ఆధ్వర్యంలో సంపూర్ణంగా నడవనున్న TV 9 మరియు NTV
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం అని న్యూస్‌మీటర్ కనుగొంది.
Next Story