ఒక బ్యానర్ ఫోటోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పేరు మరియు చిహ్నంతో పాటు "భాసా సాంస్కృతిక శాఖ" అనే వచనం చిత్రం క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ఈ నేపథ్యంలో, టీడీపీ కూటమి ప్రభుత్వం "భాష" అనే పదాన్ని తప్పు స్పెల్లింగ్‌ను ప్రదర్శించి, భాష పట్ల అగౌరవం చూపిందనే వాదనలతో సోషల్ మీడియా వినియోగదారులు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.
ఈ వైరల్ ఫోటో 2018 కి చెందినది మరియు ఇటీవలిది కాదని న్యూస్‌మీటర్ కనుగొంది.
మా పరిశోధనలో మేము వైరల్ ఫోటో యొక్క రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించాము. శోధిస్తున్నప్పుడు, ఈ వైరల్ ఫోటో కి సంబంధించిన జూలై 9, 2018 నాటి ఒక న్యూస్ ఛానెల్ రిపోర్టింగ్‌లను మేము కనుగొన్నాము.
ముఖ కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ 88వ జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యానరు ప్రింటింగ్‌లో జరిగిన అతి పెద్ద తప్పిద్దాన్ని నిర్వాహకులు ఎలా గుర్తించలేకపోయారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అంటూ 09 జూలై 2018న
Zee News న్యూస్ నివేదించింది.
"భాషా సాంస్కృతిక శాఖ" అని రాయాల్సింది, కానీ అక్షర దోషాలను గమనించకపోవడంతో "భాసా సాంస్కృతిక శాఖ"గా ముద్రించబడింది అంటూ వైరల్ ఫోటో ప్రచురించబడింది.
అంతేకాకుండా, 07 జూలై 2018 న
CPIM - Andhra Pradesh ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో భాషను భాస చేశారు.. భాష నే చూసుకోలేని భాషా సాంస్కృతిక శాఖ అంటూ వైరల్ ఫోటో పోస్ట్ చేయబడింది
అదనంగా, మేము వైరల్ ఫోటో కి సంబంధించి
06 జూలై 2018 న భాసా సాంస్కృతిక కాదమ్మా తల్లే, భాషా సాంస్కృతిక అని రాయాలి అంటూ వైరల్ అవుతున్న ఫొటోని కనుగొన్నాము.
అందువల్ల, వైరల్ అవుతున్న ఫోటో 2018 లోనిదని మరియు ఇటీవలిది అని తప్పుగా ప్రచారం చేయబడుతోందని మేము నిర్ధారించాము.