Fact Check : పసుపు రంగులో ఉన్న ఫ్లైఓవర్ ఫోటో నాగ్‌పూర్కి సంబంధిచినది, ఆంధ్రప్రదేశ్‌కి చెందినది కాదు

ఈ దావా తప్పు మరియు నాగపూర్ సంబంధిన ఫ్లైఓవర్ ఫోటో అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Badugu Ravi Chandra  Published on  18 Jun 2024 3:42 PM GMT
Fact Check : పసుపు రంగులో ఉన్న ఫ్లైఓవర్ ఫోటో నాగ్‌పూర్కి సంబంధిచినది, ఆంధ్రప్రదేశ్‌కి చెందినది కాదు
Claim: ఆంధ్ర ప్రదేశ్‌లో పసుపు రంగులో ఉన్న ఫ్లైఓవర్ ఫోటో
Fact: ఈ దావా తప్పు మరియు నాగపూర్ సంబంధిన ఫ్లైఓవర్ ఫోటో అని న్యూస్‌మీటర్ కనుగొంది.

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (NDA) భారీ విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేసి తన కార్యాలయ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఐదు ఫైళ్లపై సంతకం చేశారు. అందులో మెగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (DSC) నోటిఫికేషన్, గత ప్రభుత్వ సమయంలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రత పెన్షన్లను పెంచడం, యువతకు ఉపాధి అవకాశాలను నిర్ధారించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్య సర్వే నిర్వహించడం, అన్నా కెంటీన్లను తిరిగి ప్రారంభించడం ఉన్నాయి.


ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఫ్లైఓవర్కి తెలుగుదేశం పార్టీకి జెండా రంగుకు సంబంధించిన పసుపు రంగు వేశారు అని ప్రతిబింబిస్తూ సోషల్ మీడియాలో న్యూస్ కార్డ్ రూపంలో ఓ పోస్ట్ వైరల్ అవుతూ ఉంది


ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:


వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీవని మరియు పసుపు రంగులో ఉన్న ఫ్లైఓవర్ ఫోటో నిజానికి మహారాష్ట్రలోని నాగపూర్ అని న్యూస్‌మీటర్ కనుగొంది

మా పరిశోధనలో మేము వైరల్ పోస్ట్ యొక్క రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించాము. శోధిస్తున్నప్పుడు, మే 28, 2024 న
హలో నాగపూర్ సిటీ ఫేస్ బుక్ ఖాతాలో
ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో ""మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ప్రస్తుత ఉష్ణోగ్రత 111°F (సుమారు 44°C) మబ్బుల తో కూడిన పరిస్థితులతో 126°F (52°C) ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది అంటూ సదర్ బజార్ రోడ్డులో పసుపు రంగులో ఉన్న ఫ్లైఓవర్ ఫోటో పోస్ట్ చేయబడింది అని మేము కనుకున్నాము



అంతేకాకుండా,మేము గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించినపుడు , చిత్రంలో కనిపిస్తున్న ప్రదేశం నాగ్‌పూర్‌లోని సదర్ బజార్ రోడ్‌లో ఉన్న ఫ్లైఓవర్ అని ఇది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినది కాదు అని రుజువు అయింది మరియు మేము గూగుల్ స్ట్రీట్ వ్యూలో చూసినప్పుడు, ఫ్లైఓవర్ రంగు పసుపు రంగులో కాకుండా క్రీమ్ అని స్పష్టంగా చూడవచ్చు. ఫ్లైఓవర్‌పై పడే సూర్యకాంతి దానికి పసుపు నీడను ఇస్తోంది అని నిర్ధారించాము


అదనంగా, గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ భవనాలపై YCP పార్టీ జెండా రంగులు వేసి ప్రజాధనాన్ని ‘వృధా’ చేస్తోందని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు మరియు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు



అయితే, భవనాలపై వేసిన రంగులను 10 రోజుల్లోగా తొలగించాలని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మార్చి 9న, 2020 ఆదేశించింది. రాజకీయ పార్టీల రంగులకు పోలిక లేని ప్రభుత్వ ఆస్తులకు రంగులు వేయడానికి తగిన రంగులను నిర్దేశిస్తూ మార్గదర్శకాలను రూపొందించాలని సంబంధిత అధికారిని ఆదేశించింది.

ఆ తర్వాత ప్రభుత్వ భవనాలకు మూడు రంగులు వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను నిలిపివేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిచడంతో. నాలుగు వారాల్లోగా ప్రభుత్వ భవనాలపై ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రంగులను తొలగించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది, ఈ ఆదేశాలను పాటించకపోతే ధిక్కారానికి గురవుతామని హెచ్చరించింది.

ప్రభుత్వ భవనాలకు YCP పార్టీ జెండా రంగు సంబంధించి 04 జూన్ 2020 నాటి అదే విషయాన్ని నివేదించిన The News Minute రిపోర్టింగ్ వీడియోని కనుగొన్నాము.


అందువల్ల, వైరల్ అవుతున్న ఫ్లైఓవర్ ఫోటో నిజానికి మహారాష్ట్రలోని నాగపూర్ సంబంధించిన ఫోటో అని మరియు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినది అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.
Claim Review:ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఫ్లైఓవర్కి తెలుగుదేశం పార్టీకి జెండా రంగుకు సంబంధించిన పసుపు రంగు వేశారు అంటూ వచ్చిన పోస్ట్
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ దావా తప్పు మరియు నాగపూర్ సంబంధిన ఫ్లైఓవర్ ఫోటో అని న్యూస్‌మీటర్ కనుగొంది.
Next Story