2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టిడిపి-బిజెపిజెఎస్‌పి కూటమి 175 స్థానాలకు గాను 165 స్థానాలు గెలుచుకుని వైఎస్‌ఆర్ జగన్ మోహన్ రెడ్డి పాలనను చిత్తు చేయడంతో ఘన విజయం సాధించింది.2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పార్టీ ఘోర పరాజయం తర్వాత తిరిగి వచ్చిన మాజీ సీఎం నాయుడు స్థానాన్ని సుస్థిరం చేస్తూ టీడీపీ ఒంటరిగా 136 సీట్లతో మెజారిటీ మార్కును క్లియర్ చేసి జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించాయి.
వైఎస్సార్‌సీపీ 25 లోక్‌సభ స్థానాలకు గాను 4, 175 అసెంబ్లీ స్థానాల్లో 11 మాత్రమే గెలుచుకుంది. 2019లో గెలిచిన 22 లోక్‌సభ స్థానాలు, 151 అసెంబ్లీ స్థానాలకు ఇది చాలా దూరంలో ఉంది.
ఈ నేపథ్యంలో, జగన్ ఓటమి నమ్మశక్యంగా లేదని ద్రౌపది ముర్ము అంటూ సోషల్ మీడియాలో న్యూస్ కార్డ్ రూపంలో ఓ పోస్ట్ వైరల్ అవుతూ ఉంది
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీవని మరియు రాష్ట్రపతి ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు అని న్యూస్‌మీటర్ కనుగొంది
మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు లేదా రాజకీయ పార్టీకి సంబంధించినవి గానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు వ్యాఖ్యలు మరియు చేసెనతు ఎలాంటి నివేదికలు లేవు అని మేము కనుకున్నాము
అంతేకాకుండా, ఈ పోస్ట్ న్యూస్ కార్డ్ రూపంలో ప్రసారం చేయబడింది కానీ ఎటువంటి మీడియా సంస్థ యొక్క లోగో లేదు మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అటువంటి బహిరంగ ప్రకటన చేసినట్లు రుజువు లేదు మేము నిర్ధారించాము.
అదనంగా, జూన్ 12న ఉదయం 11:27 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ శివార్లలోని గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎన్డీయే ఇతర అగ్రనేతలు హాజరుకానున్నారు.
అందువల్ల, జగన్ ఓటమి నమ్మశక్యంగా లేదు అని రాష్ట్రపతి సంభోదించారు అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.