దాడికి గురైన ఇజ్రాయెల్ దేశానికి చెందినదని చెప్పుకునే వీడియోలో, ప్రజలు కేకలు వేస్తూ భయంతో పరుగులు తీస్తున్నట్టు, వెంటనే ఆకాశంలో ఒక పక్షి లాంటి జీవి రాకను మనం చూడవచ్చు, ఆపై మనకు మానవ కన్ను, గుర్రాలు, తాజ్ మహల్ వంటి నిర్మాణం కనిపిస్తుంది.
ఇజ్రాయెల్ పై దాడి జరగడం చూడలేక దేవుడే దిగివచ్చాడు అని, ఈ వీడియోను పలువురు షేర్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో మనం చూసేది నిజమేనా?
రండి తెలుసుకుందాం.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ ఈ వైరల్ వీడియో యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించింది.
శోధన తర్వాత మేము వీడియో గురించి నిజం కనుగొన్నాము.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ మమ్మల్ని myuz_gaza1 పేరుతో ఉన్న TikTok ప్రొఫైల్‌కి దారి తీసింది.
వైరల్ వీడియోలోని అన్ని వీడియో క్లిప్‌లు అతని ప్రొఫైల్‌లో ఉన్నాయి.
అప్‌లోడ్ చేసిన వీడియోలు సవరించబడినట్లు అతను ప్రస్తావించలేదు.
అయితే అతని ఇతర అన్ని వీడియో అప్‌లోడ్‌లను చూసినప్పుడు ఆ వీడియోలను సవరించినట్లు సులభంగా నిర్ధారించవచ్చు.
కానీ myuz_gaza1 ప్రొఫైల్‌లో అప్‌లోడ్ చేయబడిన వీడియోలలో, ఒకదానిలో ఆకాశంలో తాజ్ మహల్‌ను మనం చూడవచ్చు, వాస్తవానికి ఇది అసంభవం.
కొన్ని వీడియోలలో సరైన భవనాలు కనిపించడం కూడా మనం చూడవచ్చు.
మేము శోధించడం మరింత కొనసాగించినప్పుడు, myuz_gaza1 ప్రొఫైల్ యొక్క అవే వీడియో క్లిప్‌లను కలిగి ఉన్న మరొక వీడియోను చూశాము.
ఈ వీడియో ప్రారంభంలో ప్రజలు రోడ్లపై అరుస్తూ పరుగులు తీయడం చూశాం.
మేము ఈ వీడియో యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని అమలు చేసాము.
ప్రజలు
రోడ్లపై పరుగులు తీస్తున్న ఈ సంఘటన వాస్తవానికి
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జరిగిందని కనుగొన్నాము, ఇక్కడ మ్యాన్‌హోల్ పేలుడు సంభవించింది, దీని కారణంగా ప్రజలు సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీసారు.
ఇదే విషయాన్ని చాలా పత్రికలు నివేదించాయి.
ఇజ్రాయెల్‌పై దాడి జరగడంపై దేవుడు వచ్చాడంటూ ఇలాంటి అనేక వీడియోలు ప్రచారంలో ఉన్నాయి.
అందువల్ల , myuz_gaza1 TikTok ప్రొఫైల్ నుండి అనేక ఎడిట్ చేసిన క్లిప్‌లతో పాటు వివిధ సమయాలలో వివిధ ప్రదేశాల నుండి విభిన్న వీడియో క్లిప్‌లు జోడించిన విడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాబట్టి, ఈ వీడియో ఎడిట్ చేయబడినది అని మేము నిర్ధారించాము.