నివేదికల ప్రకారం, పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ట్రాక్టర్-ట్రాలీలు మార్చ్‌లో చేరడానికి బయలుదేరాయి. సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) మరియు కిసాన్ మజ్దూర్ మోర్చా, 200 కి పైగా రైతు సంఘాలు ఢిల్లీకి పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించాయి.
రైతులు మరియు రైతు సంస్థలు - ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ నుండి - తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (MSP) డిమాండ్ చేస్తున్నాయి. MSPకి చట్టపరమైన హామీతో పాటు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, రైతులు మరియు రైతు కూలీలకు పెన్షన్లు, వ్యవసాయ రుణమాఫీ, పోలీసు కేసుల ఉపసంహరణ మరియు లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు "న్యాయం" చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నిరసనలకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా మంది, కొత్త రకం ట్రాక్టర్ల ఫోటోను షేర్ చేస్తు "ఇవి బారికేడ్లను తొలగించడానికి, టియర్ గ్యాస్ షెల్స్‌ను నిరోధించడానికి రైతులు మోడిఫై చేసిన ట్రాక్టర్లు మరియు ఇవి 'ఢిల్లీ చలో' నిరసనలలొ ముందు ఉంటాయి" అని పేర్కొన్నారు.
"ఢిల్లీ మీదకు పంపేందుకు, జార్జ్ సోరోస్ పంపిన డబ్బుతో, హైడ్రాలిక్ పవర్ ట్రాక్టర్లను, డౌజర్లను, జేసీబీలను ఎలా మోడిఫై చేశారో చూడండి" అంటూ మరికొందరు పేర్కొన్నారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్, మోడిఫైడ్ ట్రాక్టర్‌లు అంటూ షేర్ అవుతున్న ఫోటో నిజం కాదనీ, ఆ ఫోటో AI రూపొందించినదని కానుగొంది.
మేము ఫోటో యొక్క రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించినప్పుడు, OpIndia యొక్క వార్తా నివేదికను మేము కనుగొన్నాము, దీనిలో అదే ట్రాక్టర్ల ఫోటోను వార్తలతో పాటు ప్రచురించింది,'కేంద్ర నిఘా వర్గాల సమాచారం ప్రకారం, రైతుల భారీ ఉద్యమానికి సంబంధించి పంజాబ్, యుపి, హర్యానా మరియు ఢిల్లీ పోలీసులను వారు అప్రమత్తం చేశారు. బారికేడ్‌లను తొలగించడానికి ట్రాక్టర్‌లకు హైడ్రాలిక్ సాధనాలు అమర్చబడ్డాయి, టియర్ గ్యాస్ షెల్‌లతో పోరాడేందుకు ఫైర్ రెసిస్టెంట్ హార్డ్-షెల్ ట్రైలర్‌లు సిద్ధంగా ఉన్నాయి. వారు ఈ మార్పు చేసిన వాహనాలతో కసరత్తులు కూడా చేశారు' అని ఒక అధికారి తెలిపినట్టు' ఆ వార్తలో పెరుకుంది.
దీనికి సంబంధించి , AI రూపొందించిన ఒక ఫొటోని ఆ వార్త కొసం వాడారు. OpIndia వార్తా కథనంలో,
మోడిఫైడ్ ట్రాక్టర్ల ఫోటో నిజమైనది కాదని, అది AI రూపొందించిన చిత్రం అని స్పష్టంగా పేర్కొంది.
మనం ఆ చిత్రాన్ని గమనించగలిగితే, ఈ ట్రాక్టర్లు రహదారికి కుడి వైపున కదులుతున్నట్లు మనం చూడవచ్చు, కానీ భారతదేశంలో అది కదులుతున్న దిశ ప్రకారం రహదారికి ఎడమ వైపున ప్రయాణించాలి. మరియు మనం రహదారికి అవతలి వైపు అనేక వ్యత్యాసాలను చూడవచ్చు. దీనితో మనకు తేలికగా ఇది నిజమైంది కాదని అర్థమవుతుంది.
మేము ANI లోగో ఉన్నా , మోడిఫైడ్ ట్రాక్టర్ల చిత్రాన్ని కొందరు షేర్ చేయడం కూడా చూసాము. అందుకే, రైతు నిరసనలకు సంబందించి
ANI పబ్లిష్ చేసిన న్యూస్ రిపోర్ట్స్ అన్నీ బాగా వెతికి చూశాం, ANI అసలు ఈ ఇమేజ్ నీ ఎక్కడ పబ్లిష్ చేయలేదు. రైతుల నిరసనలకు సంబంధించి ANI తన వార్తా నివేదికలో భిన్నమైన చిత్రాన్ని ప్రచురించింది.
ఇక జార్జ్ సోరోస్ మరియు ఈ ట్రాక్టర్‌లతో లింక్ గురించి నివేదించే వార్తా ఛానెల్‌లు ఏవీ మాకు కనిపించలేదు. తప్పుదారి పట్టించేందుకు కొంతమంది అతని పేరును ప్రస్తావించారు.
అందుకే , OpIndia ఉదాహరణ కోసం వాడిన AI రూపొందించిన చిత్రాన్ని , అందరు ఇది నిజం అని అనుకోని సోషల్ మీడియా అంతా బాగా షేర్ చేస్తున్నారు.
అందువలన, రైతుల 'ఢిల్లీ ఛలో' నిరసనల కోసం మోడిఫై చేసిన ట్రాక్టర్లు ఇవే అంటూ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న ఫోటో నిజం కాదు, అది AI రూపొందించింది.