లావణ్య కేసుపై ఓ న్యూస్ ఛానెల్ కవరేజీకి సంబంధించిన వీడియోను అటాచ్ చేస్తూ, ఒక X ఖాతాదారుడు ఇలా పోస్ట్ చేశాడు " హైదరాబాద్ లో MDMA డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడు విధ్యుత్ రెడ్డి. ఆంధ్ర నుంచి హైదరాబాద్ తీసుకెళ్లి అమ్ముతున్నారు.."
ఈ పోస్ట్ X మరియు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది. అంతటా తీవ్ర గందరగోళం నెలకొంది.
అసలు ఈ కేసులో నిందితులు ఎవరు?
విద్యుత్ రెడ్డి నిందితుడా లేక తప్పుడు కథనా?
నిందితులు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేస్తున్నారా?
ఈ పోస్ట్ ఎంత వరకు నిజం?
రండి తెలుసుకుందాం..
నిజ నిర్ధారణ:
న్యూస్ మీటర్, లావణ్య డ్రగ్స్ కేసుపై దర్యాప్తు చేస్తున్న అధికారులు చెప్పిన విషయాలను పరిశీలించిన తర్వాత, కోర్టు రిమాండ్ నివేదికను లోతుగా విశ్లేషించిన తర్వాత, మేము ఈ నిర్ధారణలకు వచ్చాము.
కొంతకాలం క్రితం విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన లావణ్య జల్సాలకు అలవాటు పడింది. టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ మ్యూజిక్ టీచర్ గా పని చేసింది. చిన్న సినిమాల్లో నటించింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఒక హీరోకు పరిచయమై లవర్ గా మారింది. 28-01-2024న విశ్వసనీయ సమాచారం మేరకు నిందితురాలు A-2 ని నార్సింగి పోలీసులు MGIT కళాశాల సమీపంలోని కోకాపేట్‌లో పట్టుకున్నారు. ఆమె 4 గ్రాముల MDMA పౌడర్‌ను కలిగి ఉంది. కొంతకాలంగా లావణ్య ఉనిత్ రెడ్డి ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కోర్టు రిమాండ్ రిపోర్టు ప్రకారం..
A-1 ఉనిత్ రెడ్డి [ పరారీలో ]
A-2 లావణ్య
A-3 ఇందిర [ పరారీలో ] ఉన్నట్లు తెలుస్తుంది.
ముగ్గురూ కూడా వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్ కేసులో నిందితులే.
పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. మరియు వారు పట్టుబడిన తర్వాత పోలీసులు కేసు వెనుక ఉన్న అన్ని వివరాలను వెల్లడిస్తారు .
ప్రస్తుతానికి అదే, కానీ వైరల్ పోస్ట్ చెప్పేది ఏమిటంటే, విద్యుత్ రెడ్డి హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు అని మరియు వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు అని, అతను ఆంధ్ర ప్రదేశ్ నుండి హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్నాడని పేర్కొన్నాడు.
ఈ క్లెయిమ్స్ మేము ఎక్కడా ఏ వార్తా నివేదికలో చూడలేదు మరియు దర్యాప్తు అధికారులు కూడా ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు.
రిమాండ్ రిపోర్టులో ఎక్కడా విద్యుత్‌రెడ్డి పేరు కనిపించలేదు. లావణ్యకు డ్రగ్స్ సరఫరా చేసేది ఉనిత్ రెడ్డి అని పోలీసులు తెలిపారు.
అందుకని, హైదరాబాద్ డ్రగ్స్ కేసులో విద్యుత్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడంటూ వైరల్ అవుతున్న పోస్ట్ తప్పుదారి పట్టించేది.