2014లో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల గణనీయమైన అభివృద్ధి మార్గాల్లో పయనిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తన కొత్త రాజధాని అమరావతి తో, మౌలిక సదుపాయాల నిర్మాణము మరియు పట్టణాలు, వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడం మరియు ఐటీ మరియు ఔషధ పరిశ్రమలపై దృష్టి పెట్టింది.
హైదరాబాద్‌ను రాజధానిగా కలిగిన తెలంగాణ, స్థాపించబడిన సాంకేతిక పారిస్‌రామ్‌ను ఉపయోగించి ఐటీ మరియు జీవసాంకేతికతకు కేంద్రంగా మారింది మరియు రాష్ట్రం అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది
ఈ నేపథ్యంలో, 7 వేల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ... దేశంలోనే అతి పెద్దదిగా నిలిచిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి రూపకల్పన జరిగినపుడు... అదే దేశంలో అత్యంత పెద్దదిగా ఉండేదన్నారు. ప్రస్తుతం అక్కడ పనులు జరగకపోవడం వల్ల అది కార్యరూపం దాల్చలేదని అని KTR YSRCP ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేశారు అంటూ "" వైసీపీని గెలిపించి ఏపీ ప్రజలు ఏమి కోల్పోయిందో దేశానికి వివరిస్తున్న KTR...అనే టైటిల్ తో ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ మరియు ఇక్కడ
నిజ నిర్ధారణ:
KTR చేసిన వ్యాఖ్యలు YCP ప్రభుత్వం మీద కాదు మరియు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంకి ఎలాంటి సంబంధం లేవని న్యూస్‌మీటర్ కనుగొన్నది.
మా పరిశోధనలో మేము వైరల్ వీడియో యొక్క రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించాము. శోధిస్తున్నప్పుడు, అప్పటి మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.టి.రామారావు, 2023 మార్చి 29న ‘లేక్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్’ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం నగరంలోని చెరువులను పునరుద్ధరించి, అందంగా తీర్చిదిద్దడం కోసం రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మరియు నిర్మాణదారులకు అప్పగించడం లక్ష్యంగా కార్యక్రమం ప్రారంభించారు.ఈ వీడియో మొత్తం '
MinisterKTR' యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది.
అయితే, ఆ కార్యక్రమం ప్రసంగంలో KTR మాట్లాడుతూ
[TV5 News] " 7 వేల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ... దేశంలోనే అతి పెద్దదిగా నిలిచిందని తెలంగాణ , అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కి రూపకల్పన జరిగినప్పుడు... అది దేశంలో అత్యంత పెద్దది గా ఉండే కాకపోతే ప్రస్తుతం అక్కడ పనులు జరగకపోవడం వల్ల అది కార్యరూపం దాల్చలేదని అని అన్నారు మరియు ఆ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం గురించి కానీ , ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడలేదు అని మేము కనుగొన్నాము.
అందువల్ల, YSRCPని గెలిపించి ఏపీ ప్రజలు ఏం కొలిపోయారో దేశానికి వివరిస్తున్న KTR అంటూ, ఆయన మాట్లాడుతున్న ఓ వీడియోను తప్పుగా ప్రచారం చేస్తున్నారని మేము నిర్ధారించాము.