ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనేది అంతర్జాతీయ ప్రజారోగ్యానికి బాధ్యత వహించే ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ. WHO ప్రజారోగ్య ధోరణులను పర్యవేక్షించడానికి, నియమాలు మరియు ప్రమాణాలను సెట్ చేయడానికి మరియు ఆరోగ్య అత్యవసర పరిస్థితులు మరియు మహమ్మారితో వ్యవహరించడంలో దేశాలకు మద్దతును అందించడానికి ప్రపంచ ప్రయత్నాలను సమన్వయం చేస్తుంది మరియు నడిపిస్తుంది.
ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం ఒకటి. దేశం యొక్క పాల ఉత్పత్తి ప్రధానంగా దాని పాడి పరిశ్రమ ద్వారా నడపబడుతుంది, ఇందులో వ్యవస్థీకృత మరియు అసంఘటిత రంగాలు ఉన్నాయి.
ఇక కల్తీ పాలను తీసుకోవడం వల్ల 2025 నాటికి భారతదేశంలోని 87% జనాభా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అవుతూ ఉంది.
నిజ నిర్ధారణ:
వైరల్ పోస్ట్ నిజం కాదని న్యూస్‌మీటర్ కనుగొంది. మేము WHO నుండి అటువంటి సలహా కోసం శోధించినప్పుడు, దాని అధికారిక వెబ్‌సైట్ నుండి లేదా ఇంటర్నెట్‌లో ఎక్కడా ఏమీ కనుగొనలేదు.
కానీ, ఈ వైరల్ పోస్టును ఖండిస్తూ, WHO విడుదల చేసిన ప్రెస్ నోట్ని మేము కనుగొన్నాము. ప్రెస్ నోట్లో, భారతదేశంలో కల్తీ పాల ద్వారా క్యాన్సర్ వస్తుందని WHO ఎప్పుడూ హెచ్చరించలేదని స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న నివేదికలలో ఎలాంటి నిజం లేదని. పాలు/పాల ఉత్పత్తుల కల్తీ సమస్యపై భారత ప్రభుత్వానికి ఎటువంటి సలహా ఇవ్వలేదని WHO తెలిపింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వైరల్ వాదనపై స్పందించింది. ఒక ట్వీట్ లో భారత ప్రభుత్వానికి WHO అలాంటి హెచ్చరిక ఏదీ జారీ చేయలేదని స్పష్టం చేసింది.
నవంబర్ 22, 2019న, కల్తీ పాల వినియోగం వల్ల 87% జనాభాకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని WHO ప్రభుత్వానికి సూచించిందనే పుకార్లపై అప్పటి కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పందించారు. అలాంటి సూచన ఏదీ ఇవ్వలేదని ఆయన వివరించారు. పాల కల్తీకి సంబంధించి డబ్ల్యూహెచ్ ఓ భారత ప్రభుత్వానికి ఎలాంటి సలహా ఇవ్వలేదని స్పష్టం చేశారాయన.
WHO నుండి సలహాను పేర్కొంటూ ఏ మీడియా ఛానెల్ కూడా అలాంటి వార్తలను నివేదించలేదు.
అందువల్ల, పాలు లేదా పాల ఉత్పత్తుల కల్తీపై భారత ప్రభుత్వానికి WHO ఎటువంటి సలహా జారీ చేయలేదని మేము నిర్ధారించాము.