తాజాగా పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ యువజన విభాగం నేత రషీద్‌ని అందరూ చూస్తుండగా కత్తులతో జిలానీ అనే వ్యక్తి నడిరోడ్డుపై అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి విదితమే. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి
ఈ నేపథ్యంలో, వినుకొండలో రషీద్ ని హత్యా చేసింది మా వైసీపీకి చెందిన షేక్ జిలాని అంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాకు వివరిస్తున్నారు అని ఒక వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు వైరల్ అవుతున్న వీడియో ఎడిట్ చేయబడింది అని న్యూస్ మీటర్ కనుగొంది.
మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, జూలై 18, 2024 న
Mango News యూట్యూబ్ ఛానెల్‌లో Gudivada Amarnath's Reaction On Vinukonda Incident అనే టైటిల్ తో ఒక వీడియోను కనుగొన్నాము. ఆ వీడియోలో వినుకొండ లో జరిగినటువంటి సంఘటన దేశాన్ని ఏ రకంగా కుదిపేసిందిదో రోడ్ల మీద జనం పోలీసులు ఉండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడు అయినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త ఏ రకంగా అమానుషంగా కత్తితో రెండు చేతులు నరికి ప్రాణులు తీసాడో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళతో చూసిన సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్న అంటూ మీడియాతో మాట్లాడారు.
అంతేకాకుండా, జూలై 18, 2024 న
Sakshi TV Live యూట్యూబ్ ఛానెల్‌లో Gudivada Amarnath Reaction On Punganur And Vinukonda Incidents అనే టైటిల్ తో మరో వీడియోను కనుగొన్నాము. ఆ వీడియోలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త ఏ రకంగా అమానుషంగా కత్తితో రెండు చేతులు నరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడు ప్రాణులు తీసాడో చూడండి అని గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతున్న వీడియో మేము కనుగొన్నాము.
మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత సాదించడానికి, వినుకొండ ఘటన పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విలేకరుల సమావేశం ప్రత్యక్ష ప్రసారాలను చూశాం. మేము ఈ వీడియో చూస్తున్నప్పుడు, నడిరోడ్డుపై జనం, పోలీసులు ఉండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడు, యువజన నాయకుడు అయినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త ఏ రకంగా అమానుషంగా కత్తితో రెండు చేతులు నరికి ప్రాణులు తీసాడో అంటూ ప్రెస్ మీట్ లో సంభోదించారు.
అయితే వైరల్ అయిన వీడియోలో నడిరోడ్డుపై జనం, పోలీసులు ఉండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడు, యువజన నాయకుడు కత్తితో రెండు చేతులు నరికి ప్రాణులు తీసాడో అని మీడియాతో సంభోదిన్నటు వీడియోను ఎడిట్ చేశారు అని మేము కనుగొన్నాము.
ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో "వినుకొండలో రషీద్'ని హత్యా చేసింది మా వైసీపీకి చెందిన షేక్ జిలానే అని, హతుడు రషీద్, హత్య చేసిన షేక్ జిలాని ఇద్దరు మా వైసీపీ పార్టీకి చెందిన వారే అని మీడియా ముందు చెప్తున్నా వైకాపా నేత గుడివాడ అమర్నాధ్" అనే క్యాప్షన్‌తో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అదనంగా, ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కే.శ్రీనివాసరావు స్పందించారు, ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే ఈ హత్య జరిగిందని, ఈ హత్య కు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. హత్య చేసిన జిలానీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
అందువల్ల, రషీద్ ని హత్యా చేసింది మా వైసీపీకి చెందిన షేక్ జిలాని అని గుడివాడ అమర్‌నాథ్ మీడియాకు వెవరిచ్చారు అంటూ వచ్చిన వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.