ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న YSR కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతూ వచ్చే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు TDP, Janasena, BJP కలిసి కూటమిగా [NDA] ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పిఠాపురంలోని YSR కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగ గీత ముఖ్య అనుచరుడు మిథున్ రెడ్డి నివాసంలో దాచిన నోట్లు బయటపడ్డాయి అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"పవన్ కళ్యాణ్ ను ఓడించడమే జగన్ రెడ్డి లక్ష్యం, ఎన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు అయిన పవన్ కళ్యాణ్ ని అడ్డుకోండి" అని పేర్కొంటూ అనేక మంది ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ
నిజ నిర్ధారణ :
జార్ఖండ్ లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను, పిఠాపురం లో 20 కోట్ల విలువైన డబ్బుని ED స్వాధీనం చేసుకుంది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము వైరల్ వీడియో గురించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ సహాయంతో శోధించగా మే 6, 2024న “ది వీక్‌లో” వచ్చిన నివేదిక ప్రకారం, జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ అలంగర్ ఆలం ప్రైవేట్ సెక్రటరీ సంజీవ్ లాల్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ [ED] సోదాలు నిర్వహించింది. 20 కోట్లకు పైగా రికవరీ చేసినట్లు నివేదికలో పేర్కొంది.
అంతేకాకుండా, మేము మరింత శోధించినప్పుడు, మే 6న 2023 న వార్తా సంస్థ ANI ద్వారా. ప్రాజెక్ట్ అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్‌ను ఇడి అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది అని కనుగొన్నాము.
ANI అందించిన వీడియోను మీరు క్రింద చూడవచ్చు.
అంతేకాకుండా, పిఠాపురం YCP అభ్యర్థి వంగగీత అనుచరుడు మిథున్ రెడ్డి ఇంట్లో ED దాడులపై మాకు ఎలాంటి నివేదికలు దొరకలేదు.
అందువల్ల, జార్ఖండ్ లో ఈడీ కేసుకు సంబంధించిన ఫోటోని, పిఠాపురం లో ఈడీ స్వాధీనం చేసుకుంది అని షేర్ చేస్తున్నారని మేము నిర్ధారించాము.