2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (TDP-JSP-BJP కూటమి) చేతిలో ఓడిపోయింది. కూటమికి 164 సీట్లు రాగా, జగన్ వైఎస్సార్‌సీపీకి 11 సీట్లు మాత్రమే రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఒక పార్టీకి జరిగిన అతి పెద్ద నష్టం.
ఈ నేపథ్యంలో, ఏపీలో YSRCP ఓట్లు గల్లంతు అయ్యాయని అందుకే తాము ఊహించని ఫలితాలతో ఓడిపోయాము అంటూ సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్ మీడియాకు వివరిస్తున్నారు అని ఒక వీడియో పోస్ట్
సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్ట్ YSRCPకి సంబంధం లేనిది మరియు 2019 ఎన్నికలకు సంబంధించింది అని న్యూస్‌మీటర్ కనుగొంది
మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, ఏప్రిల్ 14, 2019 న
ABN తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో Hari Prasad Complains On EC Over VVPAT Displaying Only for 3 Seconds, instead of 7 Seconds అనే టైటిల్ తో ఒక వీడియోను కనుగొన్నాము. ఆ వీడియోలో 2019 ఎన్నికల సమయంలో సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్ మీడియాతో మాట్లాడినప్పుడు VVPATలో ఓటర్ స్లిప్ 7 సెకన్లు చూపించాల్సి ఉండగా, 3 సెకన్లు మాత్రమే చూపించింది, EVM ల పనితీరు పై అనుమానం వ్యక్తం చేస్తూ తాను మరియు TDP పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు తో కలిసి ఎన్నికల సంఘం తో చర్చలు జరిపాము అని అన్నారు
అంతేకాకుండా, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో గెలుచుకోగా టీడీపీ 23 స్థానాలు మాత్రమే గెలుచుకుని పరాజయం అయింది మరియు టీడీపీ ఓడిపోవడంతో TDP తరపున సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అని TDP తరపున వాదన వినిపించేందుకు మీడియా తో మాట్లాడుతున్న సందర్భానికి సంబంధించింది
అదనంగా, ఏప్రిల్ 14, 2019 న
ETV ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానెల్‌లో EC Should Give Explanation on EVM Issue -Hariprasad Demands అనే టైటిల్ తో ఇంకో వీడియోను కనుగొన్నాము ఆ వీడియోలో VVPATలో ఓటర్ స్లిప్ 3 సెకన్లు మాత్రమే చూపించింది ఒకవేళ ఇందులో ప్రోగ్రామ్ మార్చి ఉంటే.. ఈసీ వివరణ ఇవ్వాలి,.. ప్రోగ్రామ్ ఈసీ మార్చిందా.. ఇంజినీర్లు మార్చారా అన్నది ఈసీనే చెప్పాలి... ప్రోగ్రామ్ మార్చిన యంత్రాలను ఇంజినీర్లు తొలిదశ పరీక్ష లో ఎలా ఆమోదించారు? అని ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు
అందువల్ల, EVM ట్యాంపరింగ్ వల్ల YSRCP ఓట్లు గల్లంతు అయ్యాయని అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.