SSN కాలేజీలో NCC శిక్షణ పేరుతో సీనియర్ NCC విద్యార్థులు అర్ధరాత్రి వేళ జూనియర్ విద్యార్థులను కర్రలతో కొట్టారని అనే టైటిల్ తో కొందరు బాలురు మరో విద్యార్థులు పై దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వ హయాంలో కాలేజీల్లో ర్యాగింగ్ విపరీతంగా పెరిగిపోయిందని, ఇది మన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అని పేర్కొంటూ వైసీపీ కార్యకర్తలు మరియు వైసీపీ అధికారిక ఖాతాలో ఈ వీడియోను #SaveAPFromTDP అనే ట్యాగ్‌లైన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు వైరల్ అవుతున్న వీడియో 2024 ఫిబ్రవరి లో జరిగింది అని న్యూస్ మీటర్ కనుగొంది.
మేము వైరల్ అవుతున్న పోస్ట్ గురించి పరిశోధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మేము SSN కళాశాల కమిటీని సంప్రదించాము. వారు వైరల్ వీడియో ఫిబ్రవరి 2024 లో జరిగినదని, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంత వరకు ఏ విద్యార్థి భయంతో ఈ ర్యాగింగ్ సంఘటనలపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని చెప్పారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రిన్సిపాల్‌కు మెమో జారీ చేశామని, NCC అధికారి మరియు హాస్టల్ వార్డెన్ ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు కళాశాల కమిటీ అధ్యక్షుడు వినయ్ కుమార్ న్యూస్ మీటర్‌కు వివరించారు.
అంతేకాకుండా, 2024 జూలై 26న, జిల్లా కోర్టు జడ్జి హాస్టల్‌ను తనిఖీ కోసం సందర్శించారు మరియు ర్యాగింగ్ వీడియో ఘటనపై హాస్టల్ విద్యార్థులతో మాట్లాడారు. సీనియర్ NCC విద్యార్థులు దాదాపు 35 మంది విద్యార్థులను కొట్టారని, భయంతో కళాశాల సిబ్బంది లేదా కళాశాల కమిటీకి ఫిర్యాదు చేయలేకపోయారని విద్యార్థులు వెల్లడించారు. ఈ విషయాన్ని కళాశాల కమిటీ అధ్యక్షుడు కపిలవాయి వినయ్ కుమార్ న్యూస్ మీటర్ చానల్‌కు తెలిపారు.
అదనంగా, 2024 జూలై 25న నరసరావుపేట వన్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణా రెడ్డి ఈ ఘటన ఫిబ్రవరి 2న జరిగినదని నిర్ధారించారు. అయితే, వీడియో జూలై 24న ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది మరియు ఈ వ్యవహారం ప్రస్తుతం దర్యాప్తులో ఉందని న్యూస్ మీటర్‌కు తెలిపారు అంటూ అంటూ
న్యూస్ మీటర్ తెలుగు కూడా ఈ ఘటనను వైరల్ వీడియోతో పాటు నివేదించింది.
మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, X లో 2024 జూలై 25న
PALNADU DISTRICT POLICE ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో 2024 ఫిబ్రవరి 2న SSN కళాశాల హాస్టల్ C సర్టిఫికేట్ సీనియర్ NCC విద్యార్థులు, B సర్టిఫికెట్ NCC విద్యార్దులను ప్రాక్టీస్ పేరిట రాత్రి సమయంలో కొట్టడం జరిగింది. ఆ సమయంలో వీడియో తీశారు, ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాము మరియు ఈ వ్యవహారంలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటాము అంటూ 1 టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వివరణ ఇస్తున్న వీడియో పోస్ట్ చేయబడింది.
X లో 2024 జూలై 25న FactCheck.AP.Gov.in ద్వారా మరో పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో ఈ ఘటన గత ప్రభుత్వంలో 2024 ఫిబ్రవరిలో జరిగింది. ఇప్పుడు జరిగింది అనడం అవాస్తవమే కాకుండా దురుద్దేశంతో చేసిందని స్పష్టంగా తెలుస్తుంది అని పేర్కొంది.
అందువల్ల, నిజానికి వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు ఇటీవలిది అని తప్పుగా ప్రచారం చేయబడుతోందని మేము నిర్ధారించాము.