Fact Check: రష్మిక మందన్నతో కుంభ మేళాకు వచ్చిన రోమన్ రెయిన్స్‌? ఇవి ఏఐ చిత్రాలు...

సినీ నటి రష్మిక మందన్న అమెరికన్ రెజ్లర్ రోమన్ రెయిన్స్‌తో కలిసి కుంభ మేళాకు వచ్చినట్లు క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By K Sherly Sharon
Published on : 19 Feb 2025 3:51 PM IST

Fact Check: రష్మిక మందన్నతో కుంభ మేళాకు వచ్చిన రోమన్ రెయిన్స్‌? ఇవి ఏఐ చిత్రాలు...
Claim:రష్మిక మందన్న, అమెరికన్ రెజ్లర్ రోమన్ రెయిన్స్‌ కలిసి కుంభ మేళాలో పాల్గొన్నారు.
Fact:ఈ క్లెయిమ్స్ తప్పు. వైరల్ అవుతున్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించబడ్డాయి.

Hyderabad: మహా కుంభ మేళాలో పాల్గొనడానికి భక్తులు దేశం నలుమూలల నుండి తరలి వస్తున్నారు. 2025లో జనవరి 13న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన కుంభ మేళా, ఫిబ్రవరి 26 వరకు కొనసాగబోతోంది.

సినీ నటి రష్మిక మందన్న అమెరికన్ రెజ్లర్ రోమన్ రెయిన్స్‌తో కలిసి కుంభ మేళాకు వచ్చినట్లు క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రష్మిక మందన్న, రోమన్ రెయిన్స్‌ కనిపిస్తున్న రెండు ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ "భారతదేశం ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో రష్మిక మందన్న, రోమన్ రెయిన్స్‌" అని శీర్షికలో రాశారు. (ఇంగ్లీష్ నుండి అనువదించబడింది) (ఆర్కైవ్)

Fact Check

వైరల్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ కనుగొంది. వైరల్ అవుతున్న చిత్రాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించబడ్డాయి.

రెండు వైరల్ చిత్రాను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఎటువంటి సంబంధిత దృశ్య సరిపోలికలు కనిపించలేదు.

రష్మిక మందన్న, రోమన్ రెయిన్స్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాకు వచ్చినట్లు చూపిస్తున్న కథనాలు ఏవీ కీ వర్డ్ సెర్చ్ ద్వారా దొరకలేదు. సోషల్ మీడియాలో కూడా ఎలాంటి విశ్వసనీయ సమాచారం, ఫోటోలు లేదా వీడియోలు కనిపించలేదు.

ఈ చిత్రాలలో అస్పష్టమైన బ్యాక్ గ్రౌండ్, వాస్తవికతకు భిన్నమైన ముఖ కవళికలను ఉన్నయి. ఇవి ఏఐతో రూపొందించబడిన చిత్రాలకు సాధారణ సంకేతాలు.

కాబట్టి, ఈ చిత్రాలను ఏఐతో రోపొందించారేమో అని Hive Moderation అనే ఏఐ సవరణలు గుర్తించే టూల్ ఉపయోగించాము. Hive Moderation ఈ రెండు చిత్రాలలో 99 శాతం కంటే ఎక్కువ ఏఐ-జనరేటెడ్ లేదా డీప్‌ఫేక్ కంటెంట్ ఉండే అవకాశం ఉందని నిర్ధారించింది.

Sight Engine అనే మరొక ఏఐ సవరణలు గుర్తించే టూల్ ద్వారా ఈ రెండు ఫోటోలను పరిశీలించాం. 99 శాతం ఏఐ ఉపయోగించి తయారు చేసి ఉండే అవకాశం ఉంది అని ధృవీకరించింది.

గతంలో కూడా కుంభ మేళాకి సంభందించి వచ్చిన చాలా క్లెయిమ్స్ న్యూస్‌మీటర్ పరిశీలించి, తప్పు అని తేల్చింది. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఈ ఆధారాల ద్వారా వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

Claim Review:రష్మిక మందన్న, అమెరికన్ రెజ్లర్ రోమన్ రెయిన్స్‌ కలిసి కుంభ మేళాలో పాల్గొన్నారు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్స్ తప్పు. వైరల్ అవుతున్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించబడ్డాయి.
Next Story